తెలంగాణా ఏర్పడితే రాష్ట్రములో "మత కలహాలు" ఏర్పడతై అని సీమాంధ్రులు అంటున్నారు కానీ "మత కలహాలు" అనేవి ఏ మతస్తుడు సృష్టించాడు, కుహన రాజకీయ నాయకులూ తమ స్వార్థం కోసం తమ పదవుల కాపాడుకోవడం కోసం సృష్టించినవే, మత కలహాలు కానీ ఏ మతస్తుడు కావాలని వేరే మతస్తుని హత్యలు కానీ దొమ్మిలు కానీ చేయడు చేయ జాలాడు, ఎందుకంటే వారి వెనుక రాజకీయ నాయకులూ ఉంటేనే వాడికి బలం లేకపోతే ఆ ధైర్యం వాడికి రాదు.
తెలంగాణాలో హిందూ ముస్లిం భాయి భాయి (అన్నదమ్ముల్ల ) కలసి ఉన్నారు ఇక్కడ మొహర్రం పండుగ హిందూ ముస్లిం కలసి ఘనంగా జరుపుకుంటారు. అటువంటి తెలంగాణాలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రము ఏర్పడితే "మత కలహాలు" ఎందుకు జరుగుతాయండి. మీరు మా మద్య చిచ్చు పెడుతున్నారు.

అంతేకాని తెలంగాణా ఏర్పడితే మత కలహాలు రావు. ఎప్పుడు తెలంగాణా గూర్చి మాట్లాడిన మీరు తెలంగాణా ప్రజలను కించపరిచే విధంగా మాట్లాడటం భావ్యం కాదు.
"తెలంగాణా రాష్ట్రం" కావాలని కోరడం ఈనాటిది కాదు 60 సంవత్సరాలుగా ఉద్యమిస్తున్నారు. ఉద్యమించిన ప్రతి సారీ ఏదో ఒక విధంగా ఉద్యమాన్ని అణగ త్రొక్కుతూ వస్తున్నారు.
గత అరవై సంవత్సరాలుగా మీతో కలసి ఉండడం మాకు ఇష్టం లేదు మొర్రో అంటే వినకుండా మీరు మాతో తప్పక కలసి ఉండాలే అని బలవంతంగా ఎన్ని సార్లు మా మనోభావాల్ని దెబ్బ తీస్తారు. ఇలా ఇంకా ఎన్నాళ్ళు మా నీళ్లు నిధులు దోచేస్తారు మా ఉద్యోగాలు మాకు కాకుండా చేస్తారు.